04.04.2020

04.04.2020                    శనివారం 

మనం చేస్తున్న సేవా కార్యక్రమాలకు చాలా మంది నుండి మంచి స్పందన వస్తుంది. రోజు రోజుకి కార్యకర్తలు తాము తీసుకునే జాగ్రత్తల్లో అభివృద్ధి చెందుతూ మరియు తీసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు

ఈరోజు ప్రారంభించిన “స్వయంగా వండి ప్యాక్ చేసిన భగారా రైస్” ని 270 మందికి పంచటం జరిగింది.

ఈరోజటి కార్యక్రమానికి SRR Govt Degree & PG College Principal శ్రీ ” కల్వకుంట్ల రామకృష్ణ గారు వారి స్నేహితుడు
శ్రీ “వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ -సూర్య నగర్ కాలనీ తమ విద్యార్థులు SRR Helping Hands సభ్యులు చేస్తున్న కార్యక్రమాల్ని చూసి ఆనందించి మేము కూడా మీ సేవలో బాగస్వాములం అవుతాము అని వారే స్వయంగా వచ్చి పాల్గొనటం జరిగింది.

నేడు 270 భగారా పాకెట్స్ దాతల సహాయంతో మరియు 300 మజ్జిగ పాకెట్స్ ప్రిన్సిపాల్ గారి ఔదార్యంతో పంచటం జరిగింది

గీతా భవన్,చింతకుంట, Housing Board Colony మరియు ఇతర ప్రదేశాల్లో వితరణ చేపట్టడం జరిగింది.

సభ్యులు నవీన్,స్పందన్ బాబు,వెంకటరమణ,అభినవ్,శ్రీధర్,సందీప్ రెడ్డి మరియు రాజు తమ బాధ్యతను నెరవేర్చారు…