02.04.2020

02.04.2020                    గురువారం 

ఒక రోజు విరామం తీసుకొని నూతన ఉత్తేజంతో ఈరోజు మన కార్యకర్తలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు

మనం చేసే సేవలని చూసి రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి శ్రీ ” N వెంకటరెడ్డి గారు మనల్ని సంప్రదించి వలస పోతున్న ఎందరో కూలీలకు, బీదవారికి సహాయం అందించవలిసిందిగా కోరారు.

చాలా ప్రదేశాల్లో వారిని ఉంచామని చాలామందికి ప్రభుత్వమే తగు సౌకర్యాలను అందిస్తుంది అని, మరికొందరికి సహాయాన్ని అందించడానికి సమయం పడుతుంది కావున ప్రభుత్వం వారికి సహాయాన్ని అందించే వరకు స్వచ్చంద సంస్థల తోడ్పాటు కావాలని కోరగా ఈరోజు *సన్నత్ సంఘ సేవా సంస్థ మరియు SRR Helping Hands సంస్థ వారు కలిసి 170 మందికి సరిపడా సరుకులను అందచేయటం జరిగింది.

ఇలాంటి వారు ఎంతో మంది ఆకలితో ధాతలకోసం ఎదురుచూస్తున్నారు.

మేము ఉన్నాము మీ తరువున సహాయాన్ని అందుంచటానికి ముందుకు రండి ధాతలరా వచ్చి మన తోటి వారికి కడుపునిండా అన్నం పెట్టండి

ఈ కార్యక్రమంలో నవీన్, వెంకటరమణ,అమర్, శ్రీనివాస్ రెడ్డి,చందు సాగర్ రెడ్డి,శ్రీనివాస్, పవన్ మరియు అనిల్ గారు పాల్గొనటం జరిగింది.