Category Archives: news

12.04.2020

12.04.2020              ఆదివారం – సింగరేణి కాలనీ – హైదరాబాద్ 

మనసుకు ఎంతో చేయాలని ఉన్న కొన్ని కారణాల వల్ల చేయలేక పోతాము కానీ ఆ ఆలోచనకు కృషి,సంకల్పం తోడు అయితే మార్గం అదే నీ దరి చేరుతుంది. అలాంటి అవకాశమే మనకు “అక్షర జ్యోతి ఫౌండేషన్-హైద్రాబాద్ ద్వారా లభించింది. మనం చేసే కార్యక్రమాలు వారికి చేరగా స్పందించి మనల్ని సంప్రదించి వారి పరిసరాల్లో కూలి పని చేసుకునే కుటుంబాలకు సహాయాన్ని అందించాలని కోరడం జరిగింది.

సహాయం అందించాల్సిన ప్రతి సారి మనకు తోచిన విధంగా ఎంతో కొంత మన సంస్థ నుండి స్పందించి చేయూతని అందిస్తున్నాము.

చేసే పనికి ప్రోత్సాహం, స్పందన, చేయూత అందితే ఆ ఆనందం మాటల్లో చెప్ప లేనిది. పైన వచ్చిన అభ్యర్థనకి హైద్రాబాద్ లో మనకి తెలిసిన వారిని సంప్రదించగా వెంటనే స్పందించారు,అలాంటి గొప్ప అవకాశం మన సన్నత్ కి లభించింది

వెంటనే అక్షర జ్యోతి వారి అభ్యర్థనని కార్యరూపంలో పెట్టడానికి కరీంనగర్ మరియు హైద్రాబాద్ ధాతల సహాయం తీసుకొని మన మొదటి హైద్రాబాద్ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తిచేయటం జరిగింది. 

ఈ కార్యక్రమంలో P సంతోష్, CH సంపత్, CH భాస్కర్, చందు, దశరథంలు పాల్గొన్నారు.

10.04.2020

10.04.2020                                                  శుక్రవారం

 ఒకరికిఒకరం సహాయం చేసుకోవటం,ఒకరికి ఒకరం తోడ్పడటం వల్ల ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు మరియు ఎంతో మందికి మన వంతు సహకారాన్ని అందించగలం మనకు వచ్చిన “విష్ణు ఫౌండేషన్ & చైల్డ్ కేర్(హుజురాబాద్) వారి లాక్ డౌన్ కారణంగా తమకు నెలవారీ కిరాణా సరుకుల అభ్యర్థనను వివిధ గ్రూపులలో పోస్ట్ చేయడం జరిగింది. అలా మనం తమ స్వచ్చంద గ్రూప్ లో వచ్చిన మన పోస్టుని చూసి మనతో కలిసి సమజాసేవలో భాగం పంచుకుంటున్న *”SRR Helping Hands ” వారు స్పందించి తమ కార్యకర్తలతో 6000/- కిరాణా సామగ్రి ని అందించటం జరిగింది ఇలా మన సన్నత్ సంస్థ విషయాన్ని చేరవేసి మరియు అది చూసి SRR Helping Hands వారు స్పందించి విష్ణు ఫౌండేషన్ & చైల్డ్ కేర్ వారికి సహాయం అందినది

05.04.2020

05.04.2020                                             ఆదివారం

మనం చేస్తున్న కార్యక్రమాల్ని చూసి ఐత శంకర్ లింగం (పాతబజార్) మరియు వారి కుటుంబ సభ్యులు నేడు మరియు రేపటి కార్యక్రమాల కోసం 6000/- లు ఇవ్వటం జరిగింది

నేడు వారి పేరు మీద 300 మంది –కూలీలకు,అనాధాలకు, అభాగ్యులకు గీతా భవన్ చౌరస్తా,బస్ స్టాండ్,వాల్ మార్ట్,హౌసింగ్ బోర్డ్, బొమ్మకల్ ఏరియా మరియు రోడ్డుసైడ్ ఉన్నా ఆకలితో ఎదురుచూస్తున్న వారికి అందించటం జరిగింది.

మన సభ్యులు ఈరోజు కూడా తగు జాగ్రతలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నేటి మన సభ్యులు:

వెంకటరమణ,సందీప్ రెడ్డి,అభినవ్,శ్రీనివాస్,నవీన్,శ్రీనాథ్ గారు పాల్గొన్నారు.

04.04.2020

04.04.2020                    శనివారం 

మనం చేస్తున్న సేవా కార్యక్రమాలకు చాలా మంది నుండి మంచి స్పందన వస్తుంది. రోజు రోజుకి కార్యకర్తలు తాము తీసుకునే జాగ్రత్తల్లో అభివృద్ధి చెందుతూ మరియు తీసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు

ఈరోజు ప్రారంభించిన “స్వయంగా వండి ప్యాక్ చేసిన భగారా రైస్” ని 270 మందికి పంచటం జరిగింది.

ఈరోజటి కార్యక్రమానికి SRR Govt Degree & PG College Principal శ్రీ ” కల్వకుంట్ల రామకృష్ణ గారు వారి స్నేహితుడు
శ్రీ “వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ -సూర్య నగర్ కాలనీ తమ విద్యార్థులు SRR Helping Hands సభ్యులు చేస్తున్న కార్యక్రమాల్ని చూసి ఆనందించి మేము కూడా మీ సేవలో బాగస్వాములం అవుతాము అని వారే స్వయంగా వచ్చి పాల్గొనటం జరిగింది.

నేడు 270 భగారా పాకెట్స్ దాతల సహాయంతో మరియు 300 మజ్జిగ పాకెట్స్ ప్రిన్సిపాల్ గారి ఔదార్యంతో పంచటం జరిగింది

గీతా భవన్,చింతకుంట, Housing Board Colony మరియు ఇతర ప్రదేశాల్లో వితరణ చేపట్టడం జరిగింది.

సభ్యులు నవీన్,స్పందన్ బాబు,వెంకటరమణ,అభినవ్,శ్రీధర్,సందీప్ రెడ్డి మరియు రాజు తమ బాధ్యతను నెరవేర్చారు…

03.04.2020

03.04.2020                           శుక్రవారం 

సహాయం అవసరమైన ప్రతిచోటా మాకు తోచిన విధముగా స్పందిస్తూ మన కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి రోజు కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపోయిస్తున్నారు.

ఈరోజటి కార్యక్రమ విశేషాలు మీ కోసం

ఈనాడు పత్రిక విలేకరి శ్రీ రమేష్ గారు ఇచ్చిన సమాచారం మేరకు చింతకుంటలో మధ్యప్రదేశ్ కు చెందిన కూలీలకు కరీంనగర్ కు చెందిన SRR హెల్పింగ్ హ్యాండ్స్ & సన్నత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ వాలంటీర్స్ సోషల్ డిస్టెన్సీ పాటిస్తూ వారం రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు బియ్యం, వంట సామాగ్రి, కూరగాయలు పంపిణి చేసారు.

ప్రజలను అత్యవసరం అయితేనే బయటకు రావాలని అభ్యర్థిస్తున్నారు…

ఈరోజు దాతలు: జిల్లా రంజిత్ కుమార్

ఈరోజు కార్యక్రమంలో వెంకటరమణ N.నవీన్ కుమార్, రంజిత్, అభినవ్ లు పాల్గొన్నారు.

02.04.2020

02.04.2020                    గురువారం 

ఒక రోజు విరామం తీసుకొని నూతన ఉత్తేజంతో ఈరోజు మన కార్యకర్తలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు

మనం చేసే సేవలని చూసి రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి శ్రీ ” N వెంకటరెడ్డి గారు మనల్ని సంప్రదించి వలస పోతున్న ఎందరో కూలీలకు, బీదవారికి సహాయం అందించవలిసిందిగా కోరారు.

చాలా ప్రదేశాల్లో వారిని ఉంచామని చాలామందికి ప్రభుత్వమే తగు సౌకర్యాలను అందిస్తుంది అని, మరికొందరికి సహాయాన్ని అందించడానికి సమయం పడుతుంది కావున ప్రభుత్వం వారికి సహాయాన్ని అందించే వరకు స్వచ్చంద సంస్థల తోడ్పాటు కావాలని కోరగా ఈరోజు *సన్నత్ సంఘ సేవా సంస్థ మరియు SRR Helping Hands సంస్థ వారు కలిసి 170 మందికి సరిపడా సరుకులను అందచేయటం జరిగింది.

ఇలాంటి వారు ఎంతో మంది ఆకలితో ధాతలకోసం ఎదురుచూస్తున్నారు.

మేము ఉన్నాము మీ తరువున సహాయాన్ని అందుంచటానికి ముందుకు రండి ధాతలరా వచ్చి మన తోటి వారికి కడుపునిండా అన్నం పెట్టండి

ఈ కార్యక్రమంలో నవీన్, వెంకటరమణ,అమర్, శ్రీనివాస్ రెడ్డి,చందు సాగర్ రెడ్డి,శ్రీనివాస్, పవన్ మరియు అనిల్ గారు పాల్గొనటం జరిగింది.

31.03.2020

మూడవ రోజు 31.03.2020 “సన్నత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్” & “SRR హెల్పింగ్ హ్యాండ్స్” వాలంటీర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అనాధలకు, నిరాశ్రయులకు, పోలీస్ వారికీ, మున్సిపల్ సిబ్బందికి పులిహోర పంపిణి చేసారు. 

“ప్రజలను అత్యవసరం అయితేనే బయటకు రావాలని అభ్యర్థిస్తున్నారు…”

ఈ కార్యక్రమంలో దాదాపు 170 మందికి పైగా పులిహోర పంపిన చేసారు.

పులిహోర దాతలు: “గుగ్గిల్ల లత – రమేష్”

ఈరోజు కార్యక్రమంలో N.నవీన్, వెంకటరమణ, శ్రీనివాస్ రెడ్డి, అభినవ్, స్పందన్ లు పాల్గొన్నారు.

COVID Programme

రెండవ రోజు 30.03.2020 సన్నత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ & SRR హెల్పింగ్ హ్యాండ్స్ వాలంటీర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అనాధలకు, నిరాశ్రయులకు, పోలీస్ వారికీ, మున్సిపల్ సిబ్బందికి మాస్క్ లు, మజ్జిగ పంపిణి చేసారు. ప్రజలను అత్యవసరం అయితేనే బయటకు రావాలని అభ్యర్థిస్తున్నారు…

ఈ కార్యక్రమంలో దాదాపు 400 మందికి పైగా మజ్జిగ పంపిన చేసారు.

ఈరోజు కార్యక్రమంలో N.నవీన్, వెంకటరమణ, P.శ్రీకాంత్, అభినవ్, స్పందన్, రామ-లక్ష్మణ్ లు పాల్గొన్నారు.

Corona Updates 29.03.2020

కరోనా మహామ్మారి విజృభిస్తున్న వేళ 29.03.2020 తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అనాధలకు, నిరాశ్రయులకు, మున్సిపల్ సిబ్బందికి మజ్జిగ పంపిణి చేయడానికి కరీంనగర్ లోని *సన్నత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ మరియు SRR హెల్పింగ్ హాండ్స్* వారు ముందుకు వచ్చారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా మజ్జిగ పంపిన చేసారు.

ఇలాంటి కార్యక్రమాలు కర్ఫ్యూ వున్నన్ని రోజులు నిరవధికంగా నిర్వహిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.

29.03.2020 కార్యక్రమంలో సురభి శ్రీధర్, వెంకట్, సంతోష్, అభినవ్ లు పాల్గొన్నారు.