12.04.2020

12.04.2020              ఆదివారం – సింగరేణి కాలనీ – హైదరాబాద్ 

మనసుకు ఎంతో చేయాలని ఉన్న కొన్ని కారణాల వల్ల చేయలేక పోతాము కానీ ఆ ఆలోచనకు కృషి,సంకల్పం తోడు అయితే మార్గం అదే నీ దరి చేరుతుంది. అలాంటి అవకాశమే మనకు “అక్షర జ్యోతి ఫౌండేషన్-హైద్రాబాద్ ద్వారా లభించింది. మనం చేసే కార్యక్రమాలు వారికి చేరగా స్పందించి మనల్ని సంప్రదించి వారి పరిసరాల్లో కూలి పని చేసుకునే కుటుంబాలకు సహాయాన్ని అందించాలని కోరడం జరిగింది.

సహాయం అందించాల్సిన ప్రతి సారి మనకు తోచిన విధంగా ఎంతో కొంత మన సంస్థ నుండి స్పందించి చేయూతని అందిస్తున్నాము.

చేసే పనికి ప్రోత్సాహం, స్పందన, చేయూత అందితే ఆ ఆనందం మాటల్లో చెప్ప లేనిది. పైన వచ్చిన అభ్యర్థనకి హైద్రాబాద్ లో మనకి తెలిసిన వారిని సంప్రదించగా వెంటనే స్పందించారు,అలాంటి గొప్ప అవకాశం మన సన్నత్ కి లభించింది

వెంటనే అక్షర జ్యోతి వారి అభ్యర్థనని కార్యరూపంలో పెట్టడానికి కరీంనగర్ మరియు హైద్రాబాద్ ధాతల సహాయం తీసుకొని మన మొదటి హైద్రాబాద్ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తిచేయటం జరిగింది. 

ఈ కార్యక్రమంలో P సంతోష్, CH సంపత్, CH భాస్కర్, చందు, దశరథంలు పాల్గొన్నారు.